తమిళ 'బిగ్‌బాస్ 3' ద్వారా కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న లోస్లియా!
- సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా లోస్లియా ఫొటోలే
- లోస్లియా పేరుతో ఆర్మీ కూడా ప్రారంభమైంది
- కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను అలరిస్తున్న లోస్లియా
బిగ్‌బాస్ 3లో కంటెస్టెంట్‌గా వచ్చిన అనతి కాలంలోనే లోస్లియా ఓ రేంజ్‌లో క్రేజ్‌ను సంపాదించుకుంది. అందం, మాట తీరు, చలాకీతనం, పాటలు పాడుతూ తోటి కంటెస్టెంట్లనే కాకుండా ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తోంది. దీంతో లోస్లియా పేరుతో ఇప్పటికే సోషల్ మీడియాలో ఆర్మీ కూడా ఏర్పాటైంది. గత సీజన్‌లో ఓవియాకు వచ్చినంత పాప్యులారిటీ, లోస్లియాకు స్వల్ప కాలంలోనే వచ్చేసింది. ఆమె పాడిన పాటలు, చేసిన డ్యాన్సులు టిక్‌టాక్‌తో పాటు హలో యాప్‌లోనూ ట్రెండింగ్ అవుతున్నాయి.