టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా భయపడబోం!: జేసీ పవన్ రెడ్డి
- కార్యకర్తలకు మా కుటుంబం అండగా ఉంటుంది
- గ్రామ వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ కార్యకర్తలకే
- అనంతపురం జిల్లా యాడికిలో టీడీపీ నేతలతో భేటీ
తెలుగుదేశం కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తే భయపడబోమని టీడీపీ నేత జేసీ పవన్ రెడ్డి హెచ్చరించారు. కార్యకర్తలకు తమ కుటుంబం అండగా ఉంటుందని తెలిపారు. అనంతపురంలోని యాడికిలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొందని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ఇప్పటికీ సీఎం జగన్ స్పష్టత ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అనంతపురం జిల్లా యాడికిలో ఈరోజు టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్రామ వాలంటీర్ ఉద్యోగాలను కూడా వైసీపీ కార్యకర్తలకే ఇస్తున్నారని పవన్ రెడ్డి ఆరోపించారు. ఏ ప్రభుత్వానికి అయినా 6 నెలలు లేదా సంవత్సరం హనీమూన్ పిరియడ్ ఉంటుందనీ, కానీ ఈ ప్రభుత్వం ఖర్మ ఏమిటో ‘ఎందుకు ఇలా చేస్తున్నారు?’ అంటూ ప్రజలు తిరస్కరిస్తున్నారని విమర్శించారు.