ఏపీలో రేపు జూనియర్ కళాశాలల బంద్

  • కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలి
  • కార్పొరేట్ ఫీజు దోపిడీని అరికట్టాలి
  • బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ
ఆంధ్రప్రదేశ్‌లో రేపు జూనియర్ కళాశాలలు మూతపడనున్నాయి. కార్పొరేట్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని, ఫీజు దోపిడీని అరికట్టాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం కొనసాగించాలన్న డిమాండ్‌తో గురువారం రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ కళాశాలల బంద్‌కు పిలుపునిచ్చినట్టు అఖిల భారత విద్యార్థి పరిషత్‌(ఏబీవీపీ) పేర్కొంది. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ విద్య పతనావస్థకు చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పందించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
Go Back to Shorts
ABVP
Andhra Pradesh
Junior college

More Telugu News