వైఎస్ వివేకా హత్య కేసు.. వాచ్ మెన్ కు నార్కో అనాలసిస్ పరీక్షకు కోర్టు అనుమతి

  • పులివెందుల కోర్టులో పోలీసుల పిటిషన్  
  • ఈ పిటిషన్ పై విచారించిన న్యాయస్థానం
  • పరీక్షకు అంగీకరించి వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్న  
ఆంధ్రప్రదేశ్ సీఎం వైస్ జగన్ బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆయన ఇంటి వాచ్ మెన్ కు నార్కో అనాలిసిస్ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతిచ్చింది. వివేక ఇంటి వాచ్ మెన్ రంగన్నకు నార్కో అనాలసిస్ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ పులివెందుల కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను న్యాయస్థానం పరిశీలించింది. నార్కో అనాలసిస్ పరీక్షలకు అంగీకారమేనా? అన్న కోర్టు ప్రశ్నకు రంగన్న అంగీకరించాడు. దీంతో ఈ పరీక్షలు నిర్వహించేందుకు కోర్టు అనుమతించింది. కాగా, వాచెమెన్ రంగన్నను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న, ఈరోజు ఆయన్ని పోలీసులు విచారించారు.
Go Back to Shorts
Cuddapah
Ys
Viveka
watchmen
Narco analysis

More Telugu News