జగన్ మంత్రివర్గంలో 23 మంది కోటీశ్వరులు.. 17 మందిపై క్రిమినల్ కేసులు: ఏడీఆర్
- రూ. 510 కోట్లతో అత్యంత ధనవంతుడిగా జగన్
- రెండు, మూడు స్థానాల్లో పెద్దిరెడ్డి, గౌతంరెడ్డి
- తొమ్మిది మంది మంత్రులపై సీరియస్ కేసులు
రూ. 130 కోట్లతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రెండో స్థానంలో వుండగా, మేకపాటి గౌతంరెడ్డి రూ. 61 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారని పేర్కొంది. మంత్రుల సరాసరి సంపద రూ. 35.25 కోట్లుగా ఉందని చెప్పింది. మిగిలిన ముగ్గురు మంత్రులు కూడా తమ సంపద కోటి కంటే ఎక్కువగానే ఉన్నట్టు ప్రకటించారని తెలిపింది.
ఇక మంత్రివర్గంలో 65 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. తొమ్మిది మంది మంత్రులు తమపై సీరియస్ కేసులు ఉన్నట్టు ప్రకటించారని తెలిపింది.