జగన్ గారూ.. పొదుపు కోసం 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసేయాలా?: నారా లోకేశ్ సూటిప్రశ్న
- జగన్ ప్రజల సొమ్మును విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్నారు
- ఇంటి ముందు రోడ్డుకు రూ.5 కోట్లు, టాయిలెట్ కు రూ.30 లక్షలు వెచ్చించారు
- పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వద్దనడం దారుణం
అలాగే హెలిప్యాడ్ నిర్మాణం కోసం మరో రూ.1.89 కోట్లు విచ్చలవిడిగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి సీఎం జగన్ పేద ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అవసరం లేదని చెప్పడం దారుణమని వ్యాఖ్యానించారు. పొదుపు చేసుకోవాలంటే రాష్ట్రంలోని 2 లక్షల మంది పేద విద్యార్థుల నోటి దగ్గర ముద్దనే తీసేయాలా? అని నిలదీశారు. ఈ మేరకు లోకేశ్ ట్విట్టర్ లో స్పందించారు.