యూకే హైకోర్టులో విజయ్ మాల్యాకు స్వల్ప ఊరట
- భారత్ కు అప్పగించాలన్న కోర్టు ఉత్తర్వులపై హైకోర్టు తీర్పు
- మాల్యా అప్పీల్ చేసుకోవచ్చంటూ తీర్పు
- కోర్టు వ్యవహారాలంటే క్రికెట్ మ్యాచ్ కాదన్న మాల్యా
ఇక, విచారణ జరుగుతున్న కోర్టు వద్దకు తన కుమారుడు సిద్ధార్థ్ మాల్యా, గాళ్ ఫ్రెండ్ పింకీ లాల్వానీతో కలిసి వచ్చిన విజయ్ మాల్యా భవిష్యత్ గురించి ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, కోర్టు వ్యవహారం అంటే క్రికెట్ మ్యాచ్ కాదని, ఎప్పుడు ఎలా పరిస్థితులు మారిపోతాయో అంచనా వేయలేమని అన్నారు. అయితే తన వద్ద కాకలుతీరిన లాయర్లు ఉన్నారని, వారు తన ప్రయోజనాలు కాపాడతారన్న నమ్మకం ఉందని తెలిపారు.