మా సినిమా విషయంలో మేం ఎందుకు పట్టించుకోకుండా ఉంటాం?: జీవిత
- కల్కి దర్శకత్వంలో జోక్యం చేసుకున్నారట కదా అంటూ విలేకరి ప్రశ్న
- అలాంటి ప్రశ్నలు అడగకూడదంటూ జీవిత క్లాస్
- ఎలాంటి సలహాలు ఇచ్చారని అడిగితే బాగుండేదంటూ హితవు
"రూ.20 కోట్ల ఖర్చుతో కల్కి సినిమాను నిర్మించినప్పుడు, ఆ సినిమా ఎలా తెరకెక్కుతుందోనన్న ఆందోళన నిర్మాణ బాధ్యతల్లో ఉన్నవారికి ఉంటుందా? లేదా? ముందు మాకు నచ్చితేనే కదా, ఆ తర్వాత జనాలకు నచ్చేది! మా సినిమా విషయంలో మేం ఎందుకు పట్టించుకోకుండా ఉంటాం? మీరు ప్రశ్న అడిగిన విధానం సరిగా లేదు. దర్శకత్వపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారనో, లేకపోతే, దర్శకత్వ విభాగానికి ఏమైనా సలహాలు ఇచ్చారనో మీరు అడిగితే బాగుండేది. జోక్యం చేసుకున్నారని అడగడం సరికాదు. అయినా నేను మీతో వివాదం పెట్టుకోవడంలేదు, మీ ప్రశ్నలు మాకెంత బాధ కలిగిస్తున్నాయో వివరిస్తున్నాను" అంటూ సుదీర్ఘంగా మాట్లాడారు.