అటవీశాఖ అధికారులపై దాడి ఘటనను ఉపేక్షించేది లేదు: కేంద్రం
- దాడి ఘటనపై స్పందించిన ప్రకాశ్ జవదేకర్
- దాడి ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం
- నిందితులపై ఎలాంటి చర్యలకైనా సిద్ధం
నేడు రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఈ ఘటన గురించి ప్రస్తావించారు. అటవీశాఖ అధికారులపై దాడి ఘటనను ఉపేక్షించేది లేదని, దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలను నియంత్రించేందుకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమన్నారు.