Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎలుగుబంటి గుహలో మమ్మీలా మనిషి... అసలు విషయం బయటపెట్టిన డాక్టర్!

  • వివరాలు వెల్లడించిన డాక్టర్ ఇసేవ్
  • ప్రస్తుతం బాధితుడికి వైద్యం చేస్తున్న ఇసేవ్
  • గత ఫొటో బయటపెట్టిన డాక్టర్
కొన్నిరోజుల క్రితం రష్యాలో ఓ వ్యక్తి ఎలుగుబంటి గుహలో మమ్మీలా మారిపోయిన స్థితిలో కనిపించాడంటూ పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కొందరు వేటగాళ్లు ఎలుగుబంటి గుహలో అలెగ్జాండర్ అనే వ్యక్తిని తీవ్రగాయాల పాలైన స్థితిలో గుర్తించి ఆసుపత్రిలో చేర్చినట్టు మీడియా పేర్కొంది. అలెగ్జాండర్ తనను ఎలుగుబంటి తీవ్రంగా గాయపరిచి, ఆహారంగా తినేందుకు గుహలో ఓ మూల దాచిపెట్టిందని డాక్టర్లకు చెప్పాడంటూ కథనాల్లో పేర్కొన్నారు. అయితే, అవన్నీ అబద్ధాలని ఓ డాక్టర్ చెబుతున్నారు. అలెగ్జాండర్ కు ప్రస్తుతం ఆయనే వైద్యం చేస్తున్నారు.

ఆయన పేరు డాక్టర్ రుస్తుం ఇసేవ్. తాజాగా ఆయన మీడియాకు వివరాలు వెల్లడించారు. అలెగ్జాండర్ కజకిస్థాన్ కు చెందినవాడని, గతంలో ఇలా ఉండేవాడంటూ ఓ ఫొటో విడుదల చేశారు. అతడికి సోరియాసిస్ వ్యాధి కారణంగా ఒళ్లంతా పుండ్లు పడినట్టుగా మారిపోయిందని, దానికితోడు మరికొన్ని వ్యాధులు కూడా అతడ్ని చిక్కి శల్యమయ్యేలా చేశాయని వివరించాడు. అలెగ్జాండర్ ను ఎలుగుబంటి దాడిలో గాయపడిన వ్యక్తిగా మీడియాలో చూపించడం పట్ల అతడి తల్లి తీవ్ర విచారం వ్యక్తం చేస్తోందని, దయచేసి అతడి గురించి అవాస్తవాలు రాయొద్దని డాక్టర్ ఇసేవ్ మీడియాకు విజ్ఞప్తి చేశారు.
Russia
Bear
Man
Mummy

More Telugu News