parliament: లోక్ సభలో పాట పాడిన ‘రేసు గుర్రం’ సినిమా విలన్ రవికిషన్!

  • భోజ్ పురిని 8వ షెడ్యూల్ లో చేర్చాలని వినతి
  • 25 కోట్ల మంది తమ భాషను మాట్లాడుతారని వ్యాఖ్య
  • గోరఖ్ పూర్ ఎంపీగా గెలుపొందిన సినీనటుడు

భారత్ లో 25 కోట్ల మంది భోజ్ పురి భాషను మాట్లాడుతారనీ, అర్థం చేసుకోగలరని ప్రముఖ నటుడు, బీజేపీ నేత, గోరఖ్ పూర్ లోక్ సభ సభ్యుడు రవి కిషన్ తెలిపారు. మారిషస్ లో మరో అధికార భాషగా భోజ్ పురిని గౌరవించారని చెప్పారు. కరేబియన్ దేశాల్లో కూడా భోజ్ పురి మాట్లాడుతున్నారని అన్నారు. అయినా ఇప్పటివరకూ తమ భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ లో చేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని నరేంద్ర ఇటీవల ‘కాశీ ప్రజలారా ఎలా ఉన్నారు?’ అంటూ భోజ్ పురిలో మాట్లాడారనీ, దీంతో తమ భాషకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం తామందరికీ కలిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రవికిషన్ భోజ్ పురిలో ఓ పాటను పాడి లోక్ సభ సభ్యులను అలరించారు. అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలో రవి కిషన్ విలన్ గా నటించి మెప్పించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గోరఖ్ పూర్ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ టికెట్ పై ఘనవిజయం సాధించారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News