‘రాజన్న రాజ్యం’ అంటే విత్తనాల కోసం క్యూలైన్లు, పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు అన్నమాట!: నారా లోకేశ్
- నెల్లూరు, విజయనగరం, అనంతపురంలో రైతులు అల్లాడుతున్నారు
- ఇప్పటికైనా మాపై అవినీతి బురద చల్లడం మానండి
- రైతులకు సమయానికి విత్తనాలను సరఫరా చేయండి
రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరోసారి గుర్తుచేశారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన మాని రైతులకు విత్తనాలు అందించే పని మొదలు పెట్టండి’’ అని లోకేశ్ హితవు పలికారు. ఈ సందర్భంగా విత్తనాల కోసం క్యూలైన్లలో రైతులు పడుతున్న వెతలపై ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ లో లోకేశ్ పోస్ట్ చేశారు.