కోహ్లీని నాకు వదిలిపెట్టండి, నేను అవుట్ చేస్తా: ఇంగ్లాండ్ ఆటగాడి ధీమా
- టీమిండియాకు పరుగులు రాబట్టేందుకు కోహ్లీ ఉన్నాడు
- అతడి పనిబట్టేందుకు నేనున్నా
- స్వదేశంలో భారత ఆటగాళ్లు సూపర్ స్టార్లు
ఇప్పటివరకు కోహ్లీని మొయిన్ అలీ 6 పర్యాయాలు అవుట్ చేశాడు. ఇప్పుడా ధీమాతోనే మాటలతో రెచ్చిపోతున్నట్టు అర్ధమవుతోంది. అయితే కోహ్లీ భీకరఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వరల్డ్ కప్ లో నాలుగు ఫిఫ్టీలతో సత్తా చాటాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, కోహ్లీ, మొయిన్ మైదానం వెలుపల మంచి స్నేహితులు. ఇద్దరూ ఐపీఎల్ లో ఒకే జట్టుకు ఆడుతున్నారు. రాయల్ చాలెంజర్స్ టీమ్ కు కోహ్లీ కెప్టెన్ కాగా, మొయిన్ అలీ అదే జట్టులో బ్యాట్స్ మన్.