కాంగ్రెస్ భవిష్యత్ ప్రయోజనాల కోసమే పార్టీ పదవికి రాజీనామా చేశా: రేవంత్ రెడ్డి
- వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రేవంత్ రాజీనామా
- రాహుల్ స్ఫూర్తిగా నిర్ణయం తీసుకున్నానంటున్న ఎంపీ
- ఇప్పటికే పెద్ద సంఖ్యలో రాజీనామాలు
ఈ క్రమంలో తాజాగా ఎంపీ రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో నడిచారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. రాహుల్ గాంధీ నిర్ణయం స్ఫూర్తిగానే తాను పదవి నుంచి వైదొలగినట్టు రేవంత్ స్పష్టం చేశారు. పదవిలో లేకపోయినా పార్టీని పటిష్టపరిచేందుకు తనవంతు సహకారం అందిస్తామని వివరించారు.