Andhra Pradesh: దేవుడి స్క్రిప్టులో ఇలాంటి ట్విస్టులు చాలా ఉంటాయి జగన్ గారూ!: నారా లోకేశ్ సెటైర్లు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతిని జగన్ భ్రమరావతి అన్నారనీ, ఆయన భ్రమలు తొలగించేందుకు భవంతుడు ఓ ఛాన్స్ ఇచ్చాడని వ్యాఖ్యానించారు. సచివాలయంలో సీట్లో కూర్చున్నప్పుడు, అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడైనా చంద్రబాబుకు కృత‌జ్ఞ‌త‌లు  చెప్పుకో అని భగవంతుడు తన స్క్రిప్ట్ లో కామా పెట్టాడని తెలిపారు. ‘టీడీపీ హ‌యాంలో విద్యుత్ కొనుగోళ్లు అక్రమం అని మీరంటే.. అవి ముట్టుకుంటే షాక్ కొడ‌తాయ‌ని కేంద్రంతో లేఖ రాయించాడు. దేవుడి స్క్రిప్ట్ లో ఇటువంటి కామాలు చాలానే ఉంటాయి.

దేవుడు కామా త‌రువాత మ‌ళ్లీ  స్క్రిప్ట్ రాయ‌డం మొద‌లుపెట్టాడు. మీరు అవినీతి అన్న ప‌ట్టిసీమ మోటార్లను మీతోనే ఆన్ చేయించాడు. అడ్డ‌గోల‌న్న పోల‌వ‌రం అంచ‌నాలను య‌థాత‌థంగా కేంద్రంతో ఓకే చేయించాడు. దేవుడి స్క్రిప్ట్ లో ట్విస్ట్‌లూ ఉంటాయి జ‌గ‌న్ గారూ! దేవుడు స్క్రిప్ట్ రాస్తూ పూర్తిగా ముగించ‌లేదు.రాస్తూ, రాస్తూ కామా పెట్టాడంతే! అది ఫుల్‌స్టాప్ అనుకున్నారు మీరు. ఈ గ్యాప్‌లోనే మీరు గుడినీ, గుడిలో లింగాన్ని మింగేయాల‌నుకుంటున్నారు’ అని ఘాటుగా విమర్శించారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపీ నేతలు మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.
Andhra Pradesh
Telugudesam
Nara Lokesh
Twitter
Jagan
Chief Minister

More Telugu News