shamshabad: శంషాబాద్ ఎయిర్ పోర్టులో మహిళ అదృశ్యం!

హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టులో అనూష అనే మహిళ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఖతార్ నుంచి ఆమె హైదరాబాదుకు వచ్చింది. ఆమెను రిసీవ్ చేసుకోవడానికి భర్త చంద్రశేఖర్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అయితే, ఆమె కోసం ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో, ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

మరోవైపు, ఎయిర్ పోర్టులో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇండిగో ఎయిర్ లైన్స్ ఉద్యోగినితో మద్యం మత్తులో ఉన్న ఓ యువుకుడు అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు యువకుడి కోసం గాలింపు మొదలుపెట్టారు.
shamshabad
airport
woman
missing
indigo

More Telugu News