'సూపర్ 30' సినిమాలో అప్పడాలు అమ్మే యువకుడిగా హృతిక్ రోషన్
- హృతిక్ రోషన్ హీరోగా 'సూపర్ 30'
- కథగా గణిత శాస్త్రవేత్త జీవితచరిత్ర
- వచ్చేనెల 12వ తేదీన విడుదల
ఈ నేపథ్యంలో హృతిక్ రోషన్ అప్పడాలు అమ్మే సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కండలు తిరిగిన దేహంతో హీ మ్యాన్ లా కనిపించే హృతిక్, ఓ బస్టాండ్ లో బస్సు కిటికీల దగ్గర నుంచుని అప్పడాలు అమ్ముతున్న ఈ స్టిల్ ఆశ్చర్యచకితులను చేస్తోంది. తన స్టార్ ఇమేజ్ ను పక్కన పెట్టేసి హృతిక్ చేసిన ఈ పాత్ర ఆయన క్రేజ్ ను మరింత పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. వచ్చేనెల 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.