సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'రాజుగారి గది 3' నుంచి తప్పుకున్న తమన్నా 
  • షూటింగులో జాయిన్ అయిన మెగా హీరో 
  • మరో హిందీ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న దిల్ రాజు
*  ఓంకార్ దర్శకత్వంలో తమన్నా కథానాయికగా 'రాజుగారి గది 3' చిత్రం ఇటీవల ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజక్టు నుంచి తమన్నా తప్పుకుంది. తనకు తెలియకుండా కథకు పలు మార్పులు చేయడంతో ఆమె తప్పుకున్నట్టు తెలుస్తోంది.
*  సాయిధరం తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో 'ప్రతి రోజు పండగే' పేరిట ఓ చిత్రం రూపొందుతున్న సంగతి విదితమే. ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. మూడు తరాల కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో రాశిఖన్నా కథానాయికగా నటిస్తోంది.
*  ప్రముఖ నిర్మాత దిల్ రాజు హిందీలో కూడా చిత్ర నిర్మాణాన్ని కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే బోనీకపూర్ తో కలసి 'ఎఫ్ 2' చిత్రాన్ని రీమేక్ చేస్తుండగా, తాజాగా 'జెర్సీ' చిత్రం హిందీ రీమేక్ నిర్మాణంలో కూడా భాగస్వామి అవుతున్నట్టు సమాచారం.
Go Back to Shorts
Thamanna
Omkar
Saidharam
Maruti
Dil Raju

More Telugu News