ముగిసిన విజయనిర్మల అంత్యక్రియలు

  • విజయకృష్ణ గార్డెన్స్ లో అంత్యక్రియలు
  • అంతిమ సంస్కారాలను నిర్వహించిన నరేశ్
  • భారీగా తరలి వచ్చిన అభిమానులు
సినీ నటి, నిర్మాత, దర్శకురాలు విజయనిర్మల అంత్యక్రియలు ముగిశాయి. చిలుకూరు సమీపంలోని విజయకృష్ణ గార్డెన్స్ లో అంత్యక్రియలను నిర్వహించారు. ఆమె కుమారుడు నరేశ్ ఆమెకు అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అంతకు ముందు నానక్ రామ్ గూడలోని నివాసం నుంచి ఆమె అంతిమయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమెను కడసారి చూసేందుకు భారీ ఎత్తున అభిమానులు వచ్చారు. సినీ, రాజకీయ ప్రముఖులు, బంధువులు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఆమె అంత్యక్రియలు ముగిశాయి.
Go Back to Shorts
vijaya nirmala
funerals
tollywood

More Telugu News