ముహూర్తం ఖరారు.. ఈ సాయంత్రం బీజేపీలో చేరనున్న అంబికా కృష్ణ

  • ఢిల్లీలో మకాం వేసిన అంబికా కృష్ణ
  • సాయంత్రం బీజేపీలో చేరనున్న టీడీపీ నేత
  • రాంమాధవ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్న కృష్ణ
టీడీపీ సీనియర్ నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. దీనికి సంబంధించి ముహూర్తం కూడా ఖరారైంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న ఆయన... బీజేపీ జాతీయ కార్యదర్శి రాంమాధవ్ సమక్షంలో ఈ సాయంత్రం కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. మరోవైపు టీడీపీపై బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా నుంచి మరికొందరు కూడా బీజేపీలో చేరే అవకాశముందని అంటున్నారు. 
Go Back to Shorts
ambika krishna
Telugudesam
bjp
ram madhav

More Telugu News