ఏపీ ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం.. ఇంకా భ్రమల్లో ఉంటే టీడీపీ నిలబడదు!: అశోక్ గజపతిరాజు హెచ్చరిక
- నలుగురు టీడీపీ ఎంపీల ఫిరాయింపులు
- ఓడిపోయాం కాబట్టే పోతున్నారన్న టీడీపీ నేత
- జగన్ నీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా
ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై అశోక్ గజపతిరాజు సునిశిత విమర్శలు చేశారు. ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజంటేషన్ కూడా ముఖ్యమేనని తెలిపారు. అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందనీ, అందువల్లే టీడీపీ ఓడిపోయిందని విశ్లేషించారు.
ఇప్పటికీ టీడీపీ బలంగానే ఉందనీ, తప్పులు తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు. అలా కాకుండా ఇంకా ఏదో భ్రమలో ఉండిపోతే నాయకత్వం నిలబడదు అని హెచ్చరించారు. ఏపీ సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఓమాట, ఎన్నికల తర్వాత మరోమాట చెబుతున్నారని విమర్శించారు. జగన్ లాంటి వ్యక్తులు నీతి గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు.