Kaleshawaram: మహత్తర ఘట్టానికి ముహూర్తం నేడే.. మరికాసేపట్లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించనున్న కేసీఆర్

కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తెలంగాణను సస్యశ్యామలం చేయాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కల నేటితో నెరవేరబోతోంది. తెలంగాణ ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టును మరికాసేపట్లో కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10:30 గంటలకు మేడిగడ్డ వద్ద కాళేశ్వరం పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 8:15 గంటలకు మేడిగడ్డ బ్యారేజీకి చేరుకుని హోమంలో పాల్గొంటారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం 10:50కి కన్నెపల్లి చేరుకొంటారు. 11.40కి పంపుహౌస్‌ను ప్రారంభిస్తారు.  

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఉదయం 9:30 గంటలకు ఆయన మేడిగడ్డ చేరుకుంటారు. అనంతరం 11 గంటలకు కన్నెపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం తిరిగి అమరావతి బయలుదేరుతారు.

ఇక, ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొంటున్న మరో ముఖ్య అతిథి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో 9:55కు మేడిగడ్డకు చేరుకుంటారు. మేడిగడ్డలో జరిగే ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్‌లో కన్నెపల్లి పంపు హౌస్‌కి చేరుకుని ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. అనంతరం కాళేశ్వరం ఆలయాన్ని సందర్శిస్తారు.
Kaleshawaram
Telangana
KCR
Jagan
Fadnavis

More Telugu News