హైదరాబాద్ ఇప్పటికీ సేఫ్ కాదు.. వేలాది మంది వీసాలు లేకుండా ఉంటున్నారు!: కె.లక్ష్మణ్ ఆరోపణలు
- కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థించిన బీజేపీ నేత
- ఉగ్రవాదానికి, మతానికి ముడిపెట్టరాదని వ్యాఖ్య
- ఒవైసీపై ప్రేముంటే నెత్తిన పెట్టుకోవాలని కేసీఆర్ కు సూచన
హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డాగా మారిందని గతంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ సమర్థించారు. హైదరాబాద్ ఇప్పటికీ భద్రతాపరంగా సేఫ్ కాదని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన వీసాలతో ఇంకా వేలాది మంది విదేశీయులు హైదరాబాద్ లో ఉన్నారని ఆరోపించారు. ఉగ్రవాదానికి, మతానికి ముడిపెట్టడం సరికాదన్నారు. మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేసీఆర్ కు అంతప్రేమ ఉంటే నెత్తిన పెట్టుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ ను రావొద్దని తాము కోరామని పేర్కొన్నారు.