Aame: టీజర్ లోనే ఏ హీరోయిన్ కూడా చేయని సాహసం చేసిన అమలాపాల్... 'ఆమె'కు సూపర్ రెస్పాన్స్!

  • అమలాపాల్ తాజా చిత్రం 'ఆమె'
  • విడుదలైన టీజర్
  • ప్రశంసలు కురిపిస్తున్న సినీ ప్రముఖులు
గతంలో ఏ హీరోయిన్ కూడా చేయని సాహసాన్ని చేసింది అమలాపాల్. ఆమె ప్రధానపాత్రలో నటించిన 'ఆమె' టీజర్ విడుదలై, ఇప్పుడు నెట్టింట దూసుకెళుతోంది. తమిళంలో 'ఆడై' పేరిట తయారైన సినిమా, తెలుగులో 'ఆమె'గా వస్తోంది. ఇక టీజర్ ను చూస్తుంటే, మద్యం తాగి తన బిడ్డ తప్పిపోగా, ఓ తల్లి పడే తపన, ఆపై కామాంధుల మధ్య చిక్కుకున్న యువతి పడిన అవస్థలు ప్రధానాంశమని తెలుస్తోంది.

 ఓ భవంతిలో ఒంటరిగా అమలాపాల్ పూర్తి నగ్నంగా తీవ్రమైన భయాందోళనలతో కనిపిస్తుండటం టీజర్ లో హైలైట్ సీన్ గా నిలిచింది. ఈ తరహా సీన్ ను గతంలో ఎవరూ చేయలేదని సినీ ప్రముఖులు అంటుండటం గమనార్హం. హిందీలో టీజర్ ను కరణ్ జోహార్ విడుదల చేయగా, తెలుగులో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకులకు అందించారు. టీజర్ ను మీరూ చూడవచ్చు.
Aame
Amalapaul
Teaser

More Telugu News