పట్టణ పేదలకు ప్రభుత్వ అద్దె ఇళ్లు.. సకల సౌకర్యాలతో అద్దెకివ్వాలని కేంద్రం నిర్ణయం
- పట్టణాల్లో అపార్ట్మెంట్లు నిర్మించనున్న కేంద్రం
- వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న వారికే అద్దెకు
- లబ్ధిదారుల ఎంపిక స్థానిక సంస్థలదే
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద నిర్మించనున్న ఈ అపార్ట్మెంట్లకు అయ్యే వ్యయంలో కొంత మొత్తాన్ని కేంద్ర కార్మికశాఖ, గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖలు భరించేలా ప్రభుత్వం ఒప్పించనుంది. నిర్మాణం పూర్తయ్యాక స్థానిక సంస్థల సహకారంతో లబ్ధిదారులను గుర్తించి గదులు కేటాయిస్తారు. ఆయా రాష్ట్రాల హౌసింగ్ బోర్డులు ఈ వ్యవహారాలను చూసుకుంటాయి.