టిక్‌టాక్ కోసం స్టంట్ చేయబోయి ఆసుపత్రి పాలైన యువకుడు
- పేరు తెచ్చుకోవాలనే కోరికతో సాహసాలు
- స్టంట్ చేస్తూ గాయపడిన కుమార్
- మెడ, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలు
ఈ క్రమంలో కర్ణాటకలోని తుమకూరుకు చెందిన కుమార్ అనే యువకుడు టిక్‌టాక్ కోసం ఓ స్టంట్ చేస్తూ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. తలకిందులుగా గాల్లోకి ఎగిరే స్టంట్ చేసిన కుమార్.. అది కాస్తా బెడిసి కొట్టడంతో మెడ, వెన్నెముక భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కుమార్ బెంగుళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.