ఏపీలో కొత్త ప్రభుత్వమూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • ఏ రాష్ట్రానికైనా ‘హోదా’ ఇవ్వాలనుకుంటే ముందుగా ఏపీకే ఇవ్వాలి
  • ‘హోదా’కు, పారిశ్రామిక రాయితీలకు సంబంధం లేదు
  • కాళేశ్వరం ప్రాజెక్టుపై మాకు అనుమానాలు ఉన్నాయి
ఏపీలో కొత్తగా కొలువుదీరిన ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఈ ప్రభుత్వమూ ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని విమర్శించారు. ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా కనుక ఇవ్వాలనుకుంటే ముందుగా ఏపీకే ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామని అన్నారు.

అయితే, ప్రత్యేక హోదాకు, పారిశ్రామిక రాయితీలు రావడానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టుపై తమకు చాలా అనుమానాలు ఉన్నాయని అన్నారు. తమ అనుమానాలు తీర్చిన తర్వాతే ఆ ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి జగన్ వెళ్లాలని డిమాండ్ చేశారు. నికరజలాలు లేకుండా నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టుపై జగన్ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
Go Back to Shorts
Andhra Pradesh
cm
jagan
bjp
mlc
madhav

More Telugu News