అభినందన్‌పై పాక్ యాడ్‌కు కోల్‌కతా పోలీసుల దిమ్మదిరిగే రిప్లై
- ప్రతీసారి నువ్వెలా గెలుస్తున్నావన్న సర్ఫరాజ్
- అభినందన్ స్టైల్లో సమాధానం ఇచ్చిన
- కోహ్లీ
- కోల్‌కతా పోలీసులపై ప్రశంసల వర్షం
ప్రపంచకప్‌లో దాయాది జట్ల మధ్య పోరులో భారత్ విజయం సాధించింది. ఆ వెంటనే కోల్ కతా పోలీసులు ట్వీట్ చేసిన ఫొటో తెగ వైరల్ అవుతోంది. అభినందన్ స్టైల్లోనే పాక్‌కు రిప్లై ఇచ్చింది. ఇందులో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్- టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫొటోలు ఉన్నాయి. భారత్ విజయం సాధించిన అనంతరం కోహ్లీని ఉద్దేశించి సర్ఫరాజ్.. ‘ప్రతీసారి నువ్వెలా గెలుస్తున్నావ్?’ అని ప్రశ్నిస్తాడు. దీనికి జవాబుగా కోహ్లీ ‘‘ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పకూడదు’’ అని బదులిస్తాడు. ఇది చూసిన నెటిజన్లు కోల్‌కతా పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందన్‌ను అవమానించిన పాక్‌కు భలే రిప్లై ఇచ్చారంటూ ప్రశంసిస్తున్నారు.