ఐదుసార్లు గెలిచిన నాయుడుగారు... రెండుసార్లు గెలిచిన రాంబాబుకు అడ్డం వస్తే ఎలా అధ్యక్షా?: అంబటి సెటైర్లు
- అచ్చెన్నాయుడు, అంబటి మధ్య వాడివేడి చర్చ
- అంబటి కూడా వరుసగా ఓడిపోయారన్న అచ్చెన్నాయుడు
- సభలో లేని వారి పేర్లు చెబుతున్నారని అచ్చెన్నాయుడు అభ్యంతరం
దీనిపై స్పందించిన అంబటి, ఓడిన వారు అసమర్థులు కారని అనుకోవడం ఓ ఓదార్పు వంటిదని, టీడీపీ నేతలు తమను తాము ఓదార్చుకునేందుకు ఇలాంటి మాటలంటున్నారని, ఓటమి ఓటమేనని అన్నారు. ప్రజలు చంద్రబాబును తిరస్కరించారని, ఈ విషయాన్ని అంగీకరించాల్సిందేనని అన్నారు. ఆ సమయంలో మరోసారి అచ్చెన్నాయుడు కల్పించుకోబోగా, "ఐదుసార్లు గెలిచిన నాయుడుగారు... రెండుసార్లు గెలిచిన రాంబాబుకు అడ్డం వస్తే ఎలా అధ్యక్షా?" అని చమత్కరించారు.