తండ్రిని తలుచుకుని జగన్ తీవ్ర భావోద్వేగం

  • నిన్ను మిస్సవుతున్నాం నాన్నా అంటూ ఆవేదన
  • నీ కారణంగానే ఈ స్థాయిలో ఉన్నానంటూ తండ్రికి కృతజ్ఞత
  • ప్రజలకు ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం
ఇవాళ ఫాదర్స్ డే సందర్భంగా తండ్రిని స్మరించుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్న పోస్టులకు లెక్కేలేదు. ఏపీ సీఎం జగన్ కూడా తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని స్మరించుకుంటూ తీవ్ర భావోద్వేగాలతో పోస్టు పెట్టారు. "నిన్ను మిస్సవుతున్నాం నాన్నా. ఇవాళ నువ్వు మా మధ్య ఉండాల్సిన వాడివి. నేడు నేనీ స్థాయిలో ఉన్నానంటే నీ దీవెనలు, నువ్వు నేర్పిన పాఠాలు మాత్రమే కారణం నాన్నా" అంటూ ఫేస్ బుక్ లో జగన్ పోస్టు చేశారు. హ్యాపీ ఫాదర్స్ డే అంటూ అందరికీ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. జగన్ పోస్టుకు కొద్ది సమయంలో వేల సంఖ్యలో లైకులు, భాగస్వామ్యాలు లభించాయి.
Go Back to Shorts
Jagan
YSR
Andhra Pradesh

More Telugu News