దావూద్ ఇబ్రహీంకు భయపడుతున్న రాజకీయ నేతలు రామమందిరంపై మాట్లాడటం లేదు!: సుబ్రహ్మణ్యస్వామి
- హవాలా లావాదేవీలన్నీ డీ-గ్యాంగ్ కనుసన్నల్లోనే
- ఈ గ్యాంగ్ 339 మంది అమాయకులను చంపింది
- ట్విట్టర్ లో స్పందించిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు
ప్రస్తుతం చాలామంది రాజకీయ నాయకులు రామమందిర నిర్మాణంపై మాట్లాడటానికే భయపడుతున్నారని సుబ్రహ్మణ్య స్వామి చెప్పారు. ఎందుకంటే వీరి హవాలా వ్యవహారాలన్నీ దావూద్ గ్యాంగ్ కన్నుసన్నల్లోనే సాగుతున్నాయని విమర్శించారు. వాటిని డీ-గ్యాంగ్ బయటపెడుతుందన్న విషయంతోనే నేతలు మౌనంగా ఉన్నారని దుయ్యబట్టారు.