విజయవాడ ప్రజలకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాం!: ఏపీ మంత్రులు ధర్మాన, వెల్లంపల్లి
- దుర్గగుడి ఫ్లైఓవర్ పనులు శరవేగంగా సాగుతున్నాయి
- డిసెంబర్ 31 నాటికల్లా పూర్తిచేస్తాం
- ఫ్లైఓవర్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రులు
ఈ సందర్భంగా మంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని తెలిపారు. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించామని చెప్పారు. ఈ ప్రాజెక్టు డిజైన్ ను మార్చడం కారణంగా బడ్జెట్ భారీగా పెరిగిందని వ్యాఖ్యానించారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిర్మాణం కోసం కేంద్రం నుంచి రూ.10 కోట్లు రావాల్సి ఉందని పేర్కొన్నారు.