పోలీసుల డ్రంకెన్ డ్రైవ్... చేతిలో బాటిల్ తోనే కారు దిగిన మందుబాబు!
- నిన్న రాత్రి పలు ప్రాంతాల్లో డ్రంకెన్ డ్రైవ్
- కారు దిగకుండా మందుబాబు హల్ చల్
- కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసుల నిర్ణయం
దీంతో పోలీసులు ఒకింత ఆగ్రహానికి లోనవుతూ, ఇతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాగా, నిన్నటి తనిఖీల్లో మొత్తం 48 మంది మందు కొట్టి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని, మొత్తం 20 కార్లు, 28 బైక్ లను సీజ్ చేశామని తెలిపారు. పట్టుబడిన వారికి సోమవారం నాడు బేగంపేటలో వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించి కోర్టు ముందు హాజరుపరుస్తామని అధికారులు వెల్లడించారు.