అమెరికాకు భారత్ షాక్.. 28 అమెరికా ఉత్పత్తులపై భారీగా ప్రతీకార సుంకాలు
- అల్యూమినియం, ఇనుముపై టారిఫ్‌ల ఎత్తివేతకు అమెరికా నిరాకరణ
- దిగుమతి సుంకాలు భారీగా పెంచేసిన భారత్
- ప్రియం కానున్న అమెరికా ఆల్మండ్, యాపిల్స్, వాల్నట్
అల్యూమినియం, స్టీల్ తదితర వాటిపై కొత్త టారిఫ్‌లను ఎత్తివేసేందుకు అమెరికా తిరస్కరించడంతో గతేడాది జూన్‌లో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకాన్ని 120 శాతం వరకు విధించాలని నిర్ణయించింది. అయితే, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరమైన చర్చలు జరగడంతో ఈ నిర్ణయం అమలు వాయిదా పడుతూ వస్తోంది. 2018 నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాల విలువ 152.1 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఇక, అమెరికా నుంచి ఆల్మండ్‌ను అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్న తొలి దేశంగా, యాపిల్స్‌ను అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రెండో దేశంగా భారత్ రికార్డులకెక్కింది. కాగా, భారత్ తాజా నిర్ణయంతో వీటి ధరలు మరింత ప్రియం కానున్నాయి.