Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూపర్ స్టార్ కృష్ణ ఏం చెబితే అది చేసేవారు: తమ్మారెడ్డి

  • అప్పటికే కృష్ణ గారు సూపర్ స్టార్
  • నాకు ఫ్లాపులు వచ్చి ఖాళీగా ఉన్నాను
  • పచ్చనిసంసారం చిత్రం గురించి చెప్పిన తమ్మారెడ్డి
సీనియర్ దర్శకనిర్మాత, నటుడు తమ్మారెడ్డి భరద్వాజ ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ కృష్ణ గురించి వివరించారు. పచ్చనిసంసారం చిత్రం తీసే సమయానికి కృష్ణ ఖాతాలో 295కి పైగా సినిమాలున్నాయని చెప్పారు. అప్పటికే ఆయన సూపర్ స్టార్ అని, తాము చిన్నసినిమాలు తీసుకునే దశలో ఉన్నామని తెలిపారు. అయితే తాము పచ్చనిసంసారం చిత్రం తీయకముందు ఒకటిన్నర సంవత్సర కాలం కృష్ణ మేకప్ వేసుకోలేదని వెల్లడించారు. ఆ సమయంలో పద్మాలయ స్టూడియోస్ లో కూర్చుని తాను కథలు రాసుకుంటుండే వాడ్నని, ఓసారి కృష్ణ గారు వచ్చి పలకరించారని తమ్మారెడ్డి గుర్తుచేసుకున్నారు.

ఆఫీసులోకి పిలిచి 'ఏమయ్యా, మీ దగ్గర మంచి కథేదో ఉందట కదా. అందరూ బాగుందంటున్నారు. మనం చేద్దాం' అని కృష్ణ గారు అన్నారు. కథ నచ్చితే నేను చేస్తానయ్యా అంటూ ఉత్సాహం చూపించారు. మీరు పెద్ద హీరో సార్, అంత డబ్బులు ఇచ్చుకోలేం అని చెప్పాను. కానీ ఆయన ఎంతిచ్చినా ఫర్వాలేదన్నారు. ఆ విధంగా పచ్చనిసంసారం పట్టాలెక్కింది.

అప్పటికే తాను ఎంతో పెద్ద హీరో అయినా మేకప్ తో సహా ఉదయం ఏడు గంటలకే సెట్స్ మీద ఉండేవారు. మేం ఏం చెబితే అది చేసేవారు. ఎలా చెయ్యమంటే అలా చేసేవారు. నేనిది చెయ్యను అని ఎప్పుడూ అనలేదు. ఇన్వాల్వ్ అయ్యేవాడు తప్ప ఇంటర్ ఫియర్ అయ్యేవాడు కాదు. అప్పటికి నాకు కొన్ని ఫ్లాపులు రావడంతో నేను కూడా ఖాళీగానే ఉన్నాను. అయినా కృష్ణగారు ఎంతో గౌరవం ఇచ్చారు. పచ్చని సంసారం చిత్రం సూపర్ హిట్ అయింది" అంటూ ఆనాటి సంగతులు తెలిపారు.
Tammareddy
Krishna
Super Star

More Telugu News