Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పబ్ డ్యాన్సర్ పై తోటి డ్యాన్సర్ లైంగిక వేధింపులు.. పోలీసులకు ఫిర్యాదు

  • సినిమా ఛాన్సుల కోసం హైదరాబాద్ వచ్చిన యువతి
  • అవకాశాలు రాకపోవడంతో పబ్ లో డ్యాన్సర్ గా చేరిన వైనం
  • కోరిక తీర్చాలంటూ వేధింపులకు పాల్పడ్డ తోటి డ్యాన్సర్
హైదరాబాదులో నడిరోడ్డుపై దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని బ్లేడుతో కోసి, పళ్లతో రక్కిన ఓ వ్యక్తి... గాయాలతో విలవిల్లాడుతున్న ఆమె చీరను కూడా లాగి రాక్షసానందం పొందాడు. కాళ్లతో తంతూ కిందపడేశాడు. ఈ దారుణంపై బాధితురాలు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళ్తే, సినిమా ఛాన్సుల కోసం సదరు బాధితురాలు హైదరాబాదుకు వచ్చింది. సినిమాల్లో అవకాశాలు రాకపోవడంతో... బేగంపేటలోని లెస్బన్ పబ్ లో డ్యాన్సర్ గా చేరింది. అక్కడకు వచ్చే మందుబాబులు ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నప్పటికీ... వాటిని పట్టించుకోకుండా తన పనిని తాను చేసుకుపోయేది. ఇదే సమయంలో వ్యభిచారం చేయాలని కూడా పబ్ నిర్వాహకుల నుంచి ఆమెపై ఒత్తిడి వచ్చింది. ఈ క్రమంలో తన తోటి డ్యాన్సర్ సిద్ధూ... తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో అక్కసు పెంచుకున్న సిద్ధూ... లెస్బన్ పబ్ ముందు నడిరోడ్డుపై ఆమెపై దాడికి పాల్పడ్డాడు.

తనకు జరిగిన అన్యాయం గురించి చెబుతూ బాధితురాలు కన్నీటిపర్యంతమయింది. పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసినా... వారు స్పందించలేదని వాపోయింది. తనకు న్యాయం చేయాలని వేడుకుంది.
lesbun pub
begumpet
dancer

More Telugu News