మెసేజ్ ఫార్వార్డ్ చేస్తే అకౌంట్ నుంచి రూ.లక్ష మాయం: సైబర్ నేరగాడి నయా మోసం
- ఎయిర్ టెల్ ప్రతినిధిని అంటూ ఫోన్
- రూ.10లు మీ అకౌంట్ నుంచి బదిలీ చేయాలని విజ్ఞప్తి
- మెసేజ్ ట్రాన్స్ఫర్ చేయగానే అకౌంట్ నుంచి నగదు బదిలీ
సదరు వ్యాపారి తనకు యూపీఐ ఖాతా లేదని చెప్పగా తాను ఓ మెసేజ్ పంపిస్తానని, దాన్ని తానిచ్చిన సెల్ ఫోన్ నంబర్‌కి ఫార్వర్డ్ చేస్తే చాలని నమ్మబలికాడు. అది నిజమేనేమో అనుకుని సదరు వ్యాపారి గుర్తు తెలియని వ్యక్తి పంపిన మెసేజ్‌ని ఫార్వార్డ్ చేశాడు. అంతే...కాసేపటికే అతని ఖాతా నుంచి 99,910 రూపాయలు వేరే అకౌంట్‌కు బదిలీ అయిపోయాయి. దీంతో కంగుతిన్న సదరు వ్యాపారి తాను మోసపోయానని గుర్తించి వెంటనే రాచకొండ సైబర్ క్రైం పోలీసులను ఆశయ్రించాడు.