ఢిల్లీ మెట్రో రైళ్లలో మహిళలకు ఉచితం ప్రయాణం ప్రతిపాదనను ఒప్పుకోవద్దు: ప్రధానికి లేఖ రాసిన మెట్రో రూపకర్త శ్రీధరన్
- ఢిల్లీ మెట్రోలో మహిళలకు ఉచితంపై కేజ్రీ సర్కారు ప్రతిపాదన
- ప్రభుత్వ వనరులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోరాదన్న శ్రీధరన్
- ప్రధాని జోక్యం చేసుకోవాలంటూ సూచన
ఢిల్లీ మెట్రో రైల్ వ్యవస్థ ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంలో నడిచే సంస్థ అని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, ఓ భాగస్వామి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం కుదరదని తన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ వనరులను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తగదని శ్రీధరన్ హితవు పలికారు. అంతేకాకుండా, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి సూచించారు. శ్రీధరన్ గతంలో ఢిల్లీ మెట్రోరైల్ కార్పొరేషన్ కు చీఫ్ గా వ్యవహరించారు. దేశంలో మెట్రో వ్యవస్థకు ఆయన్ను ఆద్యుడిగా భావిస్తారు. మెట్రోమ్యాన్ అనేది ఆయనకు బిరుదుగా మారిపోయింది.