అమెరికాకు చైనా మొబైల్ దిగ్గజం హువావే కౌంటర్.. సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ రూపకల్పన!
- ఈ ఏడాది అక్టోబర్ లో రిలీజ్ కు సన్నాహాలు
- ట్రేడ్ మార్క్ కోసం ఇప్పటికే దరఖాస్తు
- హువావేపై ఉత్పత్తులపై అమెరికా ఉక్కుపాదం
ప్రస్తుతం ఓఎస్ తుది పరీక్షలు కొనసాగుతున్నాయనీ, ఈ ఏడాది అక్టోబర్ కల్లా అన్ని హువావే ఉత్పత్తులకు ‘హాంగ్ మెంగ్ ఓఎస్’ ను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. ఈ ఏడాది ఆగస్టు తర్వాత తమ ఫోన్లలో గూగుల్ ఆండ్రాయిడ్ సేవలు లభించవని స్పష్టం చేసింది. దాదాపు 22.50 కోట్ల మొబైల్ ఫోన్లలో ఈ కొత్త సాఫ్ట్ వేర్ ను ఇన్ స్టాల్ చేయనున్నారు. మరోవైపు వివో, ఒప్పో కంపెనీలు ఈ ఓఎస్ ను పరీక్షించేందుకు తమ బృందాలను పంపినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ హాంగ్ మెంట్ ఓఎస్ ట్రేడ్ మార్కు కోసం హువావే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 9 దేశాలతో పాటు యూరప్ లో దరఖాస్తు చేసింది.