Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవినీతిలో కూరుకుపోయిన పోలీసులు, న్యాయవ్యవస్థ అంతకంటే అవినీతిపరుడైన నానా పాటేకర్ కు క్లీన్ చిట్ ఇచ్చారు: తనుశ్రీ దత్తా ఫైర్

  • నానా పటేకర్ కు క్లీన్ చిట్ ఇచ్చిన కోర్టు
  • మండిపడిన తనుశ్రీ దత్తా
  • నానాపై గతంలోనూ అనేకమంది ఆరోపణలు చేశారన్న నటి
లైంగిక వేధింపుల కేసులో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ కు క్లీన్ చిట్ ఇవ్వడంపై నటి తనుశ్రీ దత్తా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అవినీతి పంకిలమైన పోలీసు విభాగం, న్యాయవ్యవస్థ అంతకన్నా కళంకితుడైన నానా పటేకర్ ను ఓ మంచివాడిగా తేల్చాయని ధ్వజమెత్తారు. నానా పటేకర్  దౌర్జన్యం, బెదిరింపులు, వేధింపులకు పాల్పడినట్టు తాను మాత్రమే కాదని, గతంలోనూ అనేకమంది చిత్ర పరిశ్రమకు చెందిన మహిళలు సైతం ఆరోపణలు చేశారని తనుశ్రీ దత్తాను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా సంస్థ ట్వీట్ చేసింది. కాగా, తనుశ్రీ దత్తా ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు నానాకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టలేకపోవడంతో న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడం తెలిసిందే.
Tanushree Dutta
Nana Patekar

More Telugu News