కొందరు శవాలపై పేలాలు ఏరుకునే ప్రయత్నం చేస్తున్నారు: కుటుంబరావు విమర్శలు
- కొందరు అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు
- న్యాయం చేసేందుకు ఎంతగానో ప్రయత్నించింది
- బాధితుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చామన్న కుటుంబరావు
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడానికి వేసిన కమిటీ పారదర్శకంగా పనిచేసిందని, ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ఇచ్చామన్నారు. తమ ప్రభుత్వం గనుక తప్పు చేసి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని, తమపై ఒక్క ఆరోపణ నిరూపితమైనా ప్రజా జీవితంలో ఉండమని కుటుంబరావు స్పష్టంచేశారు.