నాదెండ్ల మనోహర్ మా పార్టీని వీడుతున్నారన్నది అబద్ధం: జనసేన
- ఇలాంటి వదంతులను నమ్మొద్దు
- నాదెండ్ల మనోహర్ విదేశీ పర్యటనలో ఉన్నారు
- ‘జనసేన’లోనే ఆయన కొనసాగుతారు
ఈ విషయమై జనసేన పార్టీ స్పందించింది. నాదెండ్ల మనోహర్ పార్టీ మారుతున్నారనే వార్తలను ఖండించింది. జనసేన పార్టీలోనే ఆయన కొనసాగుతున్నారని తెలిపింది. నాదెండ్ల మనోహర్ తో నేరుగా ఫోన్ లో మాట్లాడటం జరిగిందని, ఇతర ఏ రాజకీయ పార్టీలో చేరడంలేదని ఆయన స్పష్టం చేసినట్టు తెలిపారు. ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ తన కుటుంబసభ్యులతో కలసి విదేశీ పర్యటనలో ఉన్నారని పేర్కొంది. నాదెండ్ల అందుబాటులో లేని సమయంలో ఇలాంటి వదంతులు సృష్టించారని, ఇలాంటి వాటిని జనసైనికులు నమ్మొద్దని కోరింది. ఈ వారంలో నాదెండ్ల మనోహర్ తన పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకుంటారని జనసేన పార్టీ తెలిపింది.