ఇద్దరు స్టార్ హీరోలపై 'పెళ్లి' పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు

'పెళ్లి' సినిమాలో 'బబ్లూ' పాత్రతో పృథ్వీరాజ్ పాప్యులర్ అయ్యాడు. ఆ తరువాత ఆయన తెలుగుతో పాటు తమిళ .. కన్నడ సినిమాల్లోను అనేక పాత్రలను పోషించి మెప్పించారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, అజిత్ .. సూర్య గురించి ప్రస్తావించారు.

"అజిత్ చాలా కూల్ గా కనిపిస్తారు .. ఎవరితో ఎలా ఉండాలనేది ఆయనకి బాగా తెలుసు. షాట్ రెడీ అన్నప్పటికీ ఆయన పెద్దగా పట్టించుకోరు. అలాగే తనని పొగిడినప్పుడు కూడా పెద్దగా స్పందించరు. ఆయనకి నటనపై కంటే, వంటచేయడం వంటి ఇతర వ్యాపకాలపైనే ఆసక్తి ఎక్కువ. అలాంటి ఆయనకి ఇంతటి స్టార్ డమ్ ఎలా వచ్చిందనేది నాకు ఇప్పటికీ అర్థం కాదు.

ఇక సూర్య విషయానికొస్తే, సినిమాల్లో ఆయన ఎంత పవర్ఫుల్ గా కనిపిస్తారో .. బయట కూడా అలాగే ఉంటారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన పిరియడ్ ముగిసినట్టుగా అనిపిస్తోంది" అని అన్నారు. దాంతో పృథ్వీరాజ్ పై ఈ ఇద్దరి స్టార్ హీరోల అభిమానులు ఫైర్ అవుతున్నారు.


More Telugu News