విఫలమైన ఫేస్బుక్ ప్రేమ.. ఉరేసుకున్న సెక్యూరిటీ గార్డు
- మణికట్టు వద్ద కోసుకుని ఉరేసుకుని ఆత్మహత్య
- యువతి పెళ్లికి నిరాకరించడంతోనే అఘాయిత్యం
- బాధితుడిది అసోం
గురువారం రాత్రి మిగతా ఇద్దరూ విధులకు వెళ్లగా, బిద్యుత్ మాత్రం ఇంట్లోనే ఉన్నాడు. విధులకు వెళ్లిన వారు ఉదయం తిరిగి రాగా, తలుపు గడియపెట్టి ఉంది. ఎంతసేపు తలుపు తట్టినా తీయకపోవడంతో తలుపులు బద్దలుగొట్టి లోపలికి వెళ్లారు. లోపలి దృశ్యాన్ని చూసి వారు నిర్ఘాంతపోయారు. మణికట్టు వద్ద కత్తిగాటు చేసుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించడంతో వారొచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయితో గత కొంతకాలంగా బిద్యుత్ ప్రేమలో ఉన్నాడని, పెళ్లికి ఆమె నిరాకరించడంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటాడని సోదరుడు ప్రమోద్ పోలీసులకు తెలిపాడు.