Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఇంద్ర'లో కత్తిపట్టి తొడగొట్టిన బాలుడు... ఇప్పుడిలా సమంతతో కలిసి..!

  • బాల నటుడిగా పలు హిట్ చిత్రాల్లో నటించిన తేజ
  • ఇప్పుడు 'ఓ బేబీ'తో సెకండ్ ఇన్నింగ్స్
  • జూలై 5న విడుదల కానున్న చిత్రం
బాల నటుడిగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన తేజ ఇప్పుడు పెద్దవాడయ్యాడు. చూడాలనివుంది, యువరాజు వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలను పోషించిన తేజ, ఆపై చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇంద్ర'లో చిన్నప్పటి చిరంజీవి పాత్రను పోషిస్తూ, కత్తిపట్టి, తొడగొట్టిన సీన్ ఎంత అలరించిందో తెలుగు సినీ ప్రేక్షకులకు తెలుసు.

ఇప్పుడు పెద్దవాడైన తేజ ఆర్టిస్టుగా సెకండ్ లైఫ్ ను ప్రారంభించాడు. 'ఓ బేబీ' సినిమాలో సమంతకు మనవడిగా తేజ కీలక పాత్రను పోషిస్తున్నాడు. ఈ సినిమా ప్రమోషన్ నిమిత్తం ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి వచ్చిన తేజ మాట్లాడుతూ, తాను మళ్లీ సినిమాల్లో నటించడం ప్రారంభించానని చెప్పాడు. మనిషికి సెకండ్ లైఫ్ వస్తే ఎలా ఉంటుందన్న కథాంశంతో ఈ సినిమా ఉంటుందని, ఓల్డ్ ఏజ్ లో కనిపించే సమంతకు తాను మనవడినని చెప్పాడు. కాగా, ఈ సినిమా వచ్చే నెల 5న విడుదల కానుంది.
Teja
Indra
Oh Baby
Samanta

More Telugu News