Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మ్యాచ్ కు ముందు అమ్మాయిలతో రవిశాస్త్రి పార్టీ!

  • సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన ఫొటో
  • అమ్మాయిలతో సరదాగా రవిశాస్త్రి
  • ఫొటోలో మరో వ్యక్తి
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి క్రికెట్ ఆడే రోజుల్లో ఆయనకు ప్లేబాయ్ ఇమేజ్ ఉండేది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో రవిశాస్త్రి అంటే బాలీవుడ్ తారలు సైతం పడిచచ్చిపోయేవారంటే అతిశయోక్తికాదు. ఆయన స్నేహసంబంధాలకు దేశాల సరిహద్దులు కూడా అడ్డంకిగా నిలవలేకపోయాయి. అయితే, క్రికెట్ పై రవిశాస్త్రికున్న జ్ఞానం అపారం. అందుకే ఆయన్ను ఏరికోరి విరాట్ కోహ్లీ కోచ్ గా తెచ్చుకున్నాడు.

కానీ, ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ లో భారత్ మ్యాచ్ ఆడే ముందు రవిశాస్త్రి అమ్మాయిలతో ఓ పార్టీలో పాల్గొన్నాడన్న వార్తలు కలకలం రేపాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ కు ముందు రవిశాస్త్రి ఇద్దరు పాశ్చాత్య యువతులతో సరదాగా ఉన్న పిక్ ఒకటి తెరపైకి వచ్చింది.  దీనిపై ప్రముఖ క్రికెట్ పాత్రికేయుడు డెనిస్ ఫ్రీడ్ మాన్ అదిరిపోయే వ్యంగ్యాస్త్రం విసిరాడు. "వరల్డ్ కప్ కోసం టీమిండియా భలేగా సన్నద్ధమవుతోందే!" అంటూ వెటకారం ప్రదర్శించాడు.

కాగా, ఆ ఫొటోలో రవిశాస్త్రితో పాటు ఇద్దరు అమ్మాయిలు, మరో వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి క్రికెట్ వర్గాలకు సంబంధించిన వ్యక్తి కాకపోవడంతో ఇది పూర్తిగా రవిశాస్త్రి ప్రయివేటు వ్యవహారమని టాక్ వినిపిస్తోంది.
Cricket
Ravi Shastri

More Telugu News