ఆడుకుంటూ వెళ్లి... సాంబారులో పడి మూడేళ్ల బాలుడి మృతి
- వంట చేస్తుండగా ఘటన
- ఆడుకుంటూ వెళ్లి పడిపోయిన బాలుడు
- గమనించే సరికే మృతి
మంజునాథ్ కుటుంబ సభ్యులు ఆదివారం కర్ణాటకలోని హులిగికి దైవదర్శనం నిమిత్తం వెళ్లారు. సోమవారం మొక్కు తీర్చుకుని అక్కడే వంట చేసుకుంటున్నారు. సమీపంలోనే మంజునాథ్ కొడుకు రాజశేఖర్ ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వంట పనుల్లో నిమగ్నమై ఉండగా రాజశేఖర్ ఆడుకుంటూ అప్పుడే సిద్ధం చేసిన సాంబారు గిన్నె వద్దకు వెళ్లాడు. అనుకోకుండా అందులో పడిపోవడంతో ప్రాణాలు పోయాయి. ఈ విషయాన్ని మంజునాథ్ కుటుంబ సభ్యులు గమనించే సరికే చిన్నారి విగత జీవిగా మారాడు.