వరల్డ్ కప్ లో టీమిండియా క్రికెటర్ల కొత్త యూనిఫాం

  • కొన్ని మ్యాచ్ లకు ఆరెంజ్ డ్రెస్
  • ఇప్పటివరకు బ్లూ డ్రెస్ వేసుకున్న టీమిండియా ఆటగాళ్లు
  • రేపు తొలి మ్యాచ్ ఆడనున్న కోహ్లీ సేన
ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో టీమిండియా రేపు తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో భారత జట్టు సౌతాంప్టన్ లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. టీమిండియా అనగానే బ్లూ కలర్ యూనిఫాం అని ఎవరైనా చెప్పేస్తారు. అందుకే, భారత జట్టును మెన్ ఇన్ బ్లూ అని కూడా పిలుస్తుంటారు.

అయితే, తొలిసారిగా భారత క్రికెటర్లు మరో రంగు దుస్తుల్లో కనువిందు చేయనున్నారు. ఇప్పుడు జరుగుతున్న వరల్డ్ కప్ లో ఎంపికచేసిన మ్యాచ్ ల్లో ఆరెంజ్ కలర్ జెర్సీలు ధరించనున్నారు. అయితే ఆ మ్యాచ్ లు ఏంటన్నవి తెలియరాలేదు. మొత్తమ్మీద టీమిండియాను ఎప్పుడూ ఒకే రంగులో చూస్తున్న అభిమానులకు ఇది కాస్త మార్పు అని చెప్పాలి. మరి కాషాయ దుస్తుల్లో కోహ్లీ సేన ఎలా కనిపిస్తుందో చూడాలి!
Go Back to Shorts
Cricket

More Telugu News