Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అరుదైన వ్యాధితో ఆసుపత్రిపాలైన హీరోయిన్ స్నేహా ఉల్లాల్

  • ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్న స్నేహా ఉల్లాల్
  • విపరీతమైన జ్వరంతో ఆసుపత్రిపాలు
  • ఇన్ స్టాగ్రామ్ లో పోస్టుపెట్టిన నటి
గతంలో తెలుగులో పలు చిత్రాలు చేసిన స్నేహా ఉల్లాల్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఆటో ఇమ్యూన్ డిజార్డర్ తో బాధపడుతున్నట్టు గతంలోనే గుర్తించారు. విపరీతమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ కోలుకుంటోంది. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ శరీర వ్యాధి నిరోధక శక్తికి సంబంధించిన సమస్య.

ఎన్నిసార్లు చికిత్స తీసుకున్నా ఫలితం ఉండడంలేదని స్నేహా ఉల్లాల్ వాపోయింది. ఆసుపత్రి బెడ్ పై పడుకుని ఉండాలంటే విసుగొస్తోందని, అయితే, నెట్ ఫ్లిక్స్, కొందరు శ్రేయోభిలాషులు ప్రతిక్షణం వెంట ఉండడంతో నెట్టుకొస్తున్నానని తెలిపింది. ఈ మేరకు ఇన్ స్టాగ్రామ్ లో ఆసుపత్రి బెడ్ పై తాను పడుకున్న ఫొటోలను అమ్మడు పోస్ట్ చేసింది.

స్నేహా ఉల్లాల్ తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణతో సింహా వంటి బ్లాక్ బస్టర్ మూవీలో నటించింది. అనంతరం కొన్ని తెలుగు సినిమాల్లో చేసినా అవేవీ విజయవంతం కాలేదు. దాంతో ముంబయి మకాం మార్చింది. ఆమె చివరిగా 2014లో 'అంతా నీ మాయలోనే' చిత్రంలో నటించింది.
Tollywood
Sneha Ullal

More Telugu News