సూర్యకాంతం గారు అందరికీ భోజనాలు తీసుకొచ్చి వడ్డించారు: సుబ్బరాయ శర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సూర్యకాంతం గారు అందరికీ భోజనాలు తీసుకొచ్చి వడ్డించారు: సుబ్బరాయ శర్మ

  • 'హైహై నాయకా'లో చేశాను
  •  సూర్యకాంతం గారితో పరిచయం
  •  ఆమె మంచి మనసును ప్రత్యక్షంగా చూశాను
తాజా ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు సుబ్బరాయ శర్మ మాట్లాడుతూ, ప్రముఖ నటి సూర్యకాంతం గురించి ప్రస్తావించారు. 'జంధ్యాల గారి దర్శకత్వంలో నేను 'హైహై నాయకా' చేశాను. నరేశ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో నేను చరిత్రను బోధించే అధ్యాపకుడిగా నటించాను. ఈ సినిమాలో సూర్యకాంతమ్మ గారు కూడా ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు.

ఈ సినిమా షూటింగులోనే ఆమెతో పరిచయం కలిగింది. నన్ను చూసి ఆమె పి. ఎల్. నారాయణ అనుకున్నారు. షూటింగుకి వస్తూనే ఆమె రెండు పెద్ద క్యారియర్లు తెచ్చేవారు. ఆమె స్వయంగా అన్నీ తయారు చేసుకుని తీసుకువచ్చేవారు. లంచ్ సమయంలో ఆమె అందరికీ పెట్టేవారు. అందరూ తింటూ వుంటే ఆమె సంతోషపడిపోయేవారు. ఆమె మంచి మనసును గురించి అంతకుముందు విన్న నేను .. ఈ సినిమా షూటింగులో ప్రత్యక్షంగా చూశాను" అని చెప్పుకొచ్చారు.
subbaraya sharma

More Telugu News